విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

11 Sep, 2016 19:56 IST|Sakshi
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆలేరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఆలేరులో తిరంగయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. నిజాం నాటి ఉద్యమకారుల త్యాగాలు, చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ విమోచన దినోత్సవాన్ని ఎన్నికలకు ముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. తీరా పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 17న విమోచన దినోత్సవ వేడుకలకు హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా హాజరవుతున్నందున నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కాసం వెంకటేశ్వర్లు, తునికి దశరధ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్‌ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   
 
>
మరిన్ని వార్తలు