విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

10 Feb, 2017 22:36 IST|Sakshi
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

► జేసీ ప్రభాకర్‌రెడ్డి
ఎలిగేడు: భూసమస్యలతోపాటు వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మండలంలోని బుర్హాన్ మియాపేటకు చెందిన రైతులు గత రెండేళ్లుగా తమ ప ట్టా భూములను ఆన్ లైన్ లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారనీ జేసీకి ఫిర్యాదుచేయగా గురువా రం జేసీ ఎలిగేడు తహసీల్దార్‌ కార్యాలయంను సందర్శించి తనిఖీ చేశారు. 

రైతుల సమస్యల ను 15రోజుల్లోగా పరిష్కరించాలని వీఆర్వో తిరుపతిపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, సాదాబైనామాల సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిం చడం సరికాదన్నారు.  కార్యాలయ పనితీరుపై తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలతో సుదీర్ఘంగా చర్చించారు. జేసీ వెంట తహసీల్దార్‌ నాగరాజమ్మ, ఆర్‌ఐ అమ్జద్, వీఆర్వోలు, బుర్హాన్మియాపేట రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు