పొందుగల పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు

6 Oct, 2016 19:15 IST|Sakshi

పొందుగల : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పొందుగల గ్రామంలో పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద గురువారం ఇసుక లారీలను అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సముద్రపు ఇసుకను లోడ్ చేసుకుని లారీలు హైదరాబాద్‌కు వెళుతున్నాయి. దీంతో పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద లారీలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. లారీలకు, ఇసుక సరఫరాకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.

కొన్ని లారీల పత్రాలు సక్రమంగా లేన్నట్లు అధికారులు గుర్తించారు. పరిశీలన నిమిత్తం నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లారీలను తిప్పి పంపించారు. తనిఖీలు ఆలస్యం అవుతుండటంతో సుమారు 250కి పైగా లారీలు పొందుగల చెక్‌పోస్ట్ వద్ద నిలిచిపోయాయి. ఈ తనిఖీల్లో మైనింగ్ ఏడీ బి.జగన్నాధరావు, ఏజీ విష్ణువర్ధన్, ఎస్సై కట్టా ఆనంద్ తదితరులు ఉన్నారు. తనిఖీలు ఆలస్యం అవుతుండటంతో డ్రైవర్లు, క్లీనర్లు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు