నాటి ‘అనంత’ సాగరమే..

7 May, 2017 00:26 IST|Sakshi
నాటి ‘అనంత’ సాగరమే..

అనంతపురం కల్చరల్‌ : అనంతపురం ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఆంగ్లేయులు 1792లో టిప్పుసుల్తాన్‌ను ఓడించినపుడు ఇప్పటి జిల్లా ఈశాన్య భాగమైన తాడిపత్రి, తాడిమర్రి ప్రాంతాలు నైజాంకు వశమయ్యాయి. ఆయన 1800లో ఆంగ్లేయులకు దత్తం చేసినందువల్ల అనంతపురం బళ్లారి, కర్నూలు, కడప జిల్లాలకు దత్తమండలాలని (సీడెడ్‌ జిల్లాలని కూడా అంటారు) పేరొచ్చింది. వాటిలో ఒకటైన అనంతపురం 1882లో ఏర్పడినట్టు చరిత్రాకారులు చెపుతున్నారు.

రాయల కాలంనే ఆవిర్భావం
విజయనగర రాజైన మొదటి బుక్కరాయల వద్ద మంత్రిగా ఉన్న అనంత చిక్కప్ప ఒడయార్‌ కట్టించిన గ్రామం కావడంతో ఆయన పేరుతో అనంతపురంగా ఏర్పడింది. అనంత సాగరం అనే పెద్ద చెరువు తవ్వించి దానికి రెండు మరవల నుంచి నీరు పోవడానికి రెండు కత్వాలను, వాటికి సమీపాన రెండు గ్రామాలను నిర్మించాడు. అందులో ఒకటి గ్రామానికి రాజైన బుక్కరాయ సముద్రమని, రెండవ దానికి రాణి అనంతమ్మ పేరు కూడా కలిసొచ్చేట్టు అనంత సాగరమని పేరు పెట్టినట్టు చరిత్ర చెబుతోంది. అయితే బుక్కరాయలుకు అనంతమ్మ అనే పేరు కల్గిన రాణి లేనే లేదని చిక్కప్ప ఒడయార్‌ తన పేరుపైనే గ్రామానికి నామకరణం చేసినట్టు డాక్టర్‌ చిలకూరి నారాయణరావు లాంటి భాషా వేత్తలు పరిశోధనల్లో తేల్చి చెప్పారు. ఏది ఏమైనా నాటి అనంత సాగరమే కాల క్రమంలో అనంతపురంగా మారిందన్నది నిర్వివాదాంశం.

మరిన్ని వార్తలు