1న పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

29 Jul, 2016 19:59 IST|Sakshi

పాతబస్తీలో ఈ నెల 31న నిర్వహించే అమ్మవారికి బోనాల సమర్పణతో పాటు ఆగస్టు 1న నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపునకు అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలతో పాటు అన్ని ప్రాంతాల్లోని అమ్మవారికి స్థానిక భక్తులు భక్తిశ్రద్దలతో బోనాలను సమర్పించనున్నారు. ఈ జాతర సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా..

ఆగస్టు 1న ట్రాఫిక్ ఆంక్షలు..
అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు సందర్భంగా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు దక్షిణ మండలంలోని చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా తదితర ఏసీపీల పరిధిలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలున్నందున తాము సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణికులు, వాహనదారులు వెళ్లాలని డీసీపీ కోరారు.

పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు...
కందికల్‌గేట్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలను ఛత్రినాక పోలీస్‌స్టేషన్ వద్ద టీ జంక్షన్ నుంచి గౌలిపురా మీదుగా మళ్లీస్తారు. ఫూల్‌బాగ్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలు పత్తర్‌కీదర్గా వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి ఛత్రినాక పాత ఏసీపీ కార్యాలయం మీదుగా వెళ్లాలి. గౌలిపురా మార్కెట్ నుంచి వచ్చే వాహనాలను సుధా టాకీస్, అశోకా ిపిల్లర్ క్రాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. బాలాగంజ్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలు గౌలిపురా క్రాస్‌రోడ్డు మీదుగా వెళ్లాలి. ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి వచ్చే వాహనాలను హరిబౌలి క్రాస్ రోడ్డుగా పంపిస్తారు.

 

మీరా-కా-దయిరా, మొఘల్‌పురా నుంచి శాలిబండ వైపు వచ్చే వాహనాలను హరిబౌలి క్రాస్ రోడ్డు మీదుగా పంపిస్తారు. చాంద్రాయణగుట్ట నుంచి అలియాబాద్ వైపు వచ్చే వాహనాలను న్యూ షంషీర్‌గంజ్ టీ జంక్షన్ మీదుగా తాడ్‌బన్ వయా ఆల్మాస్ హోటల్ మీదుగా మళ్లీస్తారు. భవానీనగర్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనదారులు బీబీ బజార్ క్రాస్ రోడ్డు మీదుగా ఆలిజా కోట్లా రోడ్డు మీదుగా వెళ్లాలి. మొఘల్‌పురా నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను ఆలిజాకోట్లా మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ మీదుగా మళ్లీస్తారు. యాకుత్‌పురా నుంచి గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను ఐత్‌బార్ చౌక్ మీదుగా మళ్లీస్తారు. పురానాపూల్ నుంచి లాడ్‌బజార్ వైపు వచ్చే వాహానాలను మోతీగల్లీ వైపు మళ్లీస్తారు.

 

షక్కర్‌కోట్ నుంచి మిట్టికా షేర్ వైపు వచ్చే వాహనాలను ఘన్సీబజార్, చేలాపూర్ వైపు మళ్లిస్తారు. ఖిల్వత్ నుంచి లాడ్‌బజార్ వైపు వచ్చే వాహనాలను మోతీగల్లీ జంక్షన్ నుంచి చౌక్ మసీదు మీదుగా మళ్లిస్తారు. పురానాపూల్ మహబూబ్‌కీ మెహిందీ మీదుగా నయాపూల్ వైపు వెళ్లే వాహనాలు ముస్లింజంగ్ బ్రిడ్జి, బేగంబజార్ మీదుగా వెళ్లాలి. గౌలిగూడ, సిద్దంబర్ బజార్ నుంచి నయాపూల్‌కు వచ్చే వాహనాలు అఫ్జల్‌గంజ్ క్రాస్ రోడ్డు నుంచి ఉస్మానియా ఆసుపత్రి రోడ్డు మీదుగా వెళ్లాలి. ఆర్టీసీ బస్సులు పాత సీబీఎస్, దారుల్‌షిఫా క్రాస్ రోడ్డు, ఇంజన్‌బౌలి నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.

ఈ ప్రాంతాల్లో నిషేధం..
ఫతే దర్వాజ నుంచి హిమ్మత్‌పురా వైపు వాహనాలను అనుమతించరు. వీరంతా ఓల్గా హోటల్ నుంచి ఖిల్వత్ లేదా మోతీగల్లీ మీదుగా వెళ్లాలి. చాదర్‌ఘాట్, నూర్‌ఖాన్ బజార్, దారుల్‌షిఫాల నుంచి నయాపూల్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. దారుల్‌షిఫా నుంచి సాలార్‌జంగ్ బ్రిడ్జి మీదుగా గౌలిగూడ, అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లాలి.

మరిన్ని వార్తలు