కుమార్తె తిట్టిందని తల్లిదండ్రులు ఆత్మహత్య?

31 Aug, 2016 23:58 IST|Sakshi
  • విషయాన్ని కప్పిపుచ్చేందుకు తెలుగు మహిళ యత్నం
  •  
    కాకినాడ రూరల్‌ :
    కూతురు తమను చీటికీ మాటికీ తిడుతుండడం, ఒక్కోసారి చేయి చేసుకుంటుండడంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన తెలుగు మహిళ నాయకురాలు కావడంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం.తూర్పు గోదావరి జిల్లా కాకినాడ– సామర్లకోట రోడ్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తన తల్లిదండ్రులను బుధవారం ఉదయం మందలించి, చేయి చేసుకోవడంతో వారు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చి, ఆత్మహత్య కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై టూ టౌన్‌ పోలీసులను వివరాలు కోరగా తమకు ఆత్మహత్యపై ఎటువంటి సమాచారం లేదని, ఆసుపత్రి నుంచి ఎంఎల్‌సీ వస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 
     
మరిన్ని వార్తలు