ప్రాచీన విద్యావిధానం ఆదర్శనీయం

20 Jul, 2016 21:32 IST|Sakshi
కాత్యాయనికి మెమొంటో అందచేస్తున్న సునీతా సేన్‌ గుప్తా

యూనివర్సిటీక్యాంపస్‌: ప్రాచీన భారతీయ విద్యావిధానం ఆదర్శనీయమని బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ విద్యాపీఠంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో భాగంగా రెండోరోజు  ఆయన ప్రసంగించారు.  పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణమే లక్ష్యంగా ప్రాచీన విద్యావిధానం ఏర్పడిందని ఆయన తెలిపారు. వైయుక్తిక, సామాజిక వికాసానికి అవసరమైన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయన్నారు.  విద్యానికేతన్‌కు చెందిన గురునాథనాయుడు మాట్లాడుతూ వ్యక్తి నియంత్రణతోనే  వ్యవస్థ నిర్వహణలో నియంత్రణ కల్గుతుందన్నారు. మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కాత్యాయని మాట్లాడుతూ రామాయణ, మహాభారతాల్లో, అర్థశాస్త్రాల్లో మానవ వనరుల నిర్వహణ అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీనివాసులురెడ్డి, శివశంకర్‌రెడ్డి, సౌజన్య, సునీతా  సేన్‌ గుప్తా ప్రసంగించారు.
 

మరిన్ని వార్తలు