గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య

19 Mar, 2017 22:58 IST|Sakshi

కొత్తకోట: మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్దుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘంటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక బుడగజంగాల కాలనీకి చెందిన రామస్వామి(70), అచ్చమ్మలు దంపతులు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రామస్వామి మానసికస్థితి సరిగా లేక జీవసమాధి అవుతానంటూ కుటుంబీకులను బెదిరించేవాడు. ఈ క్రమంలో పెద్ద కొడుకు శివ, కోడలు పద్మలతో రామస్వామి తరచూ గొడవపడేవాడు.

మూడు రోజుల క్రితం పద్మను రామస్వామి గాయపరచడంతో పెద్దలు మందలించారు. ఆదివారం ఉదయం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రామస్వామి కూరగాయలు తరిగే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే క్షతగాత్రుడిని ప్రైవేటు వాహనంలో వనపర్తికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే రామస్వామి మృతిచెందాడని ఏఎస్సై సత్తార్‌ తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

కరోనా : బాలయ్య విరాళం.. చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!