ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య

20 Jul, 2016 22:29 IST|Sakshi
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్త్యాలపల్లికి చెందిన మంద పోషయ్య(60)కు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. విషయాన్ని గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు, మృతుడి భార్య సూరమ్మ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 
>
మరిన్ని వార్తలు