అందరుండి అనాథ అయిన వృద్ధుడు

18 Mar, 2016 04:53 IST|Sakshi
అందరుండి అనాథ అయిన వృద్ధుడు

వెంకటాపురం : మండల పరిధిలోని ఎదిర గ్రామానికి చెందిన ఉమ్మనేని నరేందర్(60)కు అందరూ ఉన్నారు. కాని అనాథగా మిగిలాడు. బిక్షాటన చేసి కడుపు నింపుకుంటున్నాడు. ఈ దుస్థితి పగవారికి కూడా రాకూడదని పలువురు చెబుతున్నారు. ఎదిర గ్రామానికి చెందిన ఉమ్మనేని నరేందర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నా రు. కూతుళ్లకు పెళ్లి చేయటంతో అత్తారిళ్లకు వెళ్లిపోయారు. ఇద్దరు కొడుకులు బాబురావు, సాంబశివరావులు పెళ్లి చేసుకోని ఒకరు బెస్తగూడెం, మరొకరు వీరాపురం గ్రామాల్లో నివాసముంటున్నారు. కన్న తండ్రి నరేందర్‌ను సక్రమంగా చూసుకోలేదు. అన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటివేశారు. గత రెండు సంవత్సరాల నుంచి భద్రాచలం రామాలయంలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం నరేందర్ ఆరోగ్యం క్షిణించింది. భద్రాచలం రామాలయం నుంచి వెంకటాపురం చేరుకున్నాడు. దీనికి తమ గ్రామస్తుడైన జాడి పోశాలు సాయం చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరు చేరదీయక పోవటంతో వెంకటాపురం బస్టాండ్‌లోని చెట్టు కింద సోమ్మసిల్లి పడిపోయాడు. కొందరు వ్యక్తులు పోన్ ద్వారా ఎస్సై సముద్రాల జితేందర్‌కు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ ఆ ప్రాంతానికి చేరుకుని ఆ వృద్ధుడ్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు