వీడిన వృద్ధురాలి హత్యకేసు మిస్టరీ

1 Sep, 2016 23:37 IST|Sakshi
వీడిన వృద్ధురాలి హత్యకేసు మిస్టరీ
రావులపాలెం: రావులపాలెంలో సంచలనం కలిగించిన గొలుగూరి శేషాయమ్మ(70) హత్యకేసు మిస్టరీ వీడింది. రావులపాలెం పోలీసులు మూడు రోజుల్లోనే కేసు ఛేదించి నలుగురు  నిందితులను అరెస్టు చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్‌. అంకయ్య గురువారం సాయంత్రం రావులపాలెం పోలీస్‌స్టేçÙన్‌లో విలేకరుల సమావేశంలో  చోరీ సొత్తుతోపాటు నింది తులను చూపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం చిన్నవంతెన సమీపంలోని రామాలయం వీధిలో గొలుగూరి శేషాయమ్మ అద్దెకు ఉంటోంది. పక్క పోర్షన్‌లో  అద్దెకు ఉంటున్న సత్తి భాగ్యలక్ష్మి, సత్తి వీర్రాఘవరెడ్డి దంపతులు కిరా ణా వ్యాపారం చేసుకొంటున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలైన వారు శేషాయమ్మ వద్ద కూడా రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు.  భాగ్యలక్ష్మి అన్న కొవ్వూరి వెంకటరెడ్డి అరటి వ్యాపారం చేసి నష్టపోయి అప్పుల పాలయ్యాడు.  శేషాయమ్మను చంపి ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలు చోరీ చేసి తమ అప్పులు తీర్చుకోవాలని భాVýæ్యలక్ష్మి, వీర్రాఘవ రెడ్డి, వెంకటరెడ్డి, అతని భార్య రోజా పథకం రచించారు.  ఆమేరకు గత నెల 28వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సత్తి వీర్రాఘవరెడ్డి, వెంకటరెడ్డి రోడ్డుపై కాపలాగా ఉండగా భాగ్యలక్ష్మి, రోజాలు శేషాయమ్మను వడ్డీ డబ్బు ఇస్తామని పిలిచి ఆమె చీరకొంగునే మెడకు బిగించి భాVýæ్యలక్ష్మి కిందపడేయగా రోజా ఆమె నోరు ముక్కు మూసివేసి ఊపిరిరాడకుండా చేసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 8 బంగారు గాజులు,  రెండు పేటల బంగారు గొలుసు, దుద్దుల జత దొంగిలించారు. దర్యాప్తులో పోలీçసులకు అనుమానం రావడంతో భాVýæ్యలక్ష్మి, రోజాలతో పాటు వారి భర్తలను అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. వారివద్ద నుంచి శేషాయమ్మకు చెందిన 18 కాసుల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నింది తులను శుక్రవారం కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీచెప్పారు.  సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్, అదనపు ఎస్సై శోభన్‌కుమార్, ఏఎస్సై ఆర్‌వీరెడ్డి, పీఎస్సైలు సురేంద్ర, మూర్తి, కానిస్టేబుల్‌ స్వామిలను ఆయన అభినందించారు.
 
 
మరిన్ని వార్తలు