మళ్లీ సీతమ్మకే పగ్గాలు

23 May, 2017 02:14 IST|Sakshi
మళ్లీ సీతమ్మకే పగ్గాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రస్తుత అధ్యక్షురాలు తోట సీతారామలక్షి్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో వివిధస్థాయిల కమిటీలను ఎంపిక చేశామని, జిల్లా కమిటీ నాయకులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని 15 నియోజకవర్గాల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఈ మేరకు తోట సీతారామలక్షి్మని ఎన్నుకున్నామని, ఆమెతో పాటు జిల్లా కమిటీలోని ఇతర పదవులకు, అనుబంధ కమిటీలకు నాయకులను ఎన్నుకున్నామని చెప్పారు. జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శులుగా ఉప్పాల జగదీష్‌బాబు, చెలికాని సోంబాబు, పార్టీ జిల్లా కార్యాలయ కార్యనిర్వహక కార్యదర్శిగా పాలి ప్రసాద్, కోశాధికారిగా శ్రీకాకుళపు వెంకట నరసింహరావును ఎన్నుకున్నామన్నారు. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలుగా గంగిరెడ్ల మేఘాలాదేవి, ప్రధాన కార్యదర్శులుగా భైరెడ్డి ఆదిలక్ష్మి, బెజ్జం అచ్చాయమ్మ, తెలుగు రైతు అధ్యక్షులుగా పసల అచ్యుత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా దొంగ నాగరాజు, బీసీ అధ్యక్షులుగా కొనుకు జనార్దన్, ప్రధాన కార్యదర్శిగా షేక్‌ మీరా, జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా మహబూబ్‌ ఆలీఖాన్‌ (జాని), ప్రధాన కార్యదర్శులుగా అల్‌తాఫ్, సుభానీని ఎన్నుకున్నామని చెప్పారు. ఎస్సీ అధ్యక్షులుగా దాసరి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పీతల శ్రీనివాస్, లీగల్‌ సెల్‌ అధ్యక్షులుగా పేరాబతి్తన సాయిరమేష్, వాణిజ్య సెల్‌ అధ్యక్షులుగా పాట్రు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చుండూరి సత్యనారాయణ, టీఎన్‌టీయూసీ అధ్యక్షులుగా ఆసన సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా మారిశెట్టి వేణుగోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయుడు, టీఎన్‌టీఎస్‌ఎఫ్‌ అధ్యక్షులుగా మద్దిపాటి ధర్మేంద్ర, చేనేత విభాగం అధ్యక్షులుగా అందే వీరభద్రం, క్రిస్టియన్‌ విభాగం అధ్యక్షులు గేదెల జాన్,  వైద్య విభాగం అధ్యక్షులుగా సుంకర సుధీర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.స్లీవ్‌రాజును ఎన్నుకున్నారు.  
మంత్రులు కొల్లు రవీంద్ర, కేఎస్‌ జవహర్, పితాని సత్యనారాయణ, పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు చిక్కాల సూర్యనారాయణ, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాలి ప్రసాద్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, నిమ్మల రామానాయుడు, వేటుకూరి శివరామరాజు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు