చిల్లర కష్టాలు

18 Nov, 2016 03:20 IST|Sakshi
చిల్లర కష్టాలు

పనిచేయని ఏటీఎం కేంద్రాలు
జిల్లాకు చేరుకోని   రూ.500 నోట్లు
బ్యాంకుల్లో వంద నోట్ల కొరత
8 రోజుల్లో రూ.1,400 కోట్ల నగదు మార్పిడి

తిరుపతి (అలిపిరి) : పెద్ద నోట్ల రద్దు ప్రభావం జిల్లా ప్రజలను వీడడం లేదు. తెల్లారితే బ్యాంకుల ముందు పడిగాపులే. 10 రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లా ప్రజలకు నోటు పాట్లు తప్పడం లేదు. వంద నోట్ల కొరత ఫలితంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులుగా పరిమిత సంఖ్యలో ఏటీఎంలు తెరుచుకోవడం.. గంటలోపే క్యాష్ ఖాళీ అవుతుండడంతో ఖాతాదారులు విసిగివేసారిపోతున్నారు. గడచిన 8 రోజుల్లో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.1,400 కోట్ల నగదు మార్పిడి లావాదేవీలు జరిగారుు. నల్లధనంపై యుద్ధం మంచి చర్యే అరుునప్పటికీ ప్రస్తుతం మాత్రం సాధారణ ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టింది. చిన్నా చితక వ్యాపారస్తులు సరుకుల దిగుమతికి చిల్లర కష్టాలు మొదలయ్యారుు. వారు పాత నోట్లను చేతబట్టి బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. సామాన్య జనం అరకొర నగదును చేత బట్టి బ్యాంకులకు పరుగులు తీస్తూనే వున్నారు. దీంతో బ్యాంకుల్లో రద్దీ నెలకుంది. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు సరిపడ చిల్లర నోట్లు రాకపోవడంతో బ్యాంకు యాజమాన్యం కౌంటర్‌లో క్యాష్ వున్నంత వరకు లావాదేవీలు జరిపి చేతులెత్తేస్తున్నారు.

ఏటీఎం కేంద్రాలలో  నో క్యాష్ :
జిల్లాలో 708 ఏటీఎంలు పూర్తి స్థారుులో పనిచేయడం లేదు. నగదు కొరత వల్ల 10 శాతం కంటే తక్కవ ఏటీఎంలు పనిచేస్తున్నారుు. అరకొర  ఏటీఎం కేంద్రాల్లో గంటలోపే క్యాష్ ఖాళీ అవుతోంది. రూ.100 నోట్ల బ్యాంకుల్లో నిల్వ లేకపోవడం ఇందుకు కారణం. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు రూ.500 నోట్ల చేరుకున్నా ఇంతవరకు మన జిల్లాకు చేరుకోలేదు. గత 8 రోజుల్లో 593 బ్యాంకు శాఖలు, పోస్టాఫీసుల్లో రూ.1400 కోట్ల మేర నగదు మార్పిడి జరిగింది. బ్యాంకులు, పోస్టాపీసుల్లో గురువారం రూ.150 కోట్ల మేర నగదు మార్పడి జరిగిందని జిల్లా బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఆర్బీఐ శుక్రవారం నుంచి నగదు మార్పిడి పరిమితి రూ.4,500 నుంచి రూ.2వేలకు కుదించడంతో మరిన్ని నోటు కష్టాలు తప్పేటట్లు లేదు. గత 8 రోజులుగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జరిగిన నగదు మార్పిడి లావాదేవీలు ఇలా వున్నారుు.

మరిన్ని వార్తలు