లక్ష లడ్డూలు సిద్ధం

12 Aug, 2016 18:09 IST|Sakshi
లక్ష లడ్డూలు సిద్ధం
మహానంది(కర్నూలు): కృష్ణా పుష్కరాల సందర్భంగా మహానంది క్షేత్రానికి భక్తులరద్దీ పెరుగుతుందన్న అంచనాల మేరకు లక్ష లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ బి.శంకర వరప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ కష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీశైలం, సంగమేశ్వరం క్షేత్రాలకు భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుందన్నారు.

రెండు పుణ్యక్షేత్రాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు మహానందికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందులో భాగంగా మహానంది క్షేత్రంలో 12 నుంచి 23 వరకు ప్రతి రోజూ పదివేల లడ్లు సిద్ధంగా ఉండేలా చూస్తామన్నారు. భక్తులకు ప్రసాదాల కొరత రానివ్వమన్నారు. అలాగే గత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి వెళ్లి గోదావరి జలాలు తెచ్చి భక్తులకు పవిత్ర తీర్థంగా పంపిణీ చేశామన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు అందజేస్తే ఈ ఏడాది కూడా అలాగే పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని వార్తలు