సిద్దేశ్వరం అలుగు సాధన పోరుకు ఏడాది

30 May, 2017 22:12 IST|Sakshi
సిద్దేశ్వరం అలుగు సాధన పోరుకు ఏడాది
 – ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేసిన రైతు ఉద్యమం
– ప్రజాగ్రహానికి జడిసే ఈ యేడాది శ్రీశైలంలో నీటి నిల్వ
– చట్టబద్ద హక్కు కోసం రైతుల పోరాటం కొనసాగుతోంది
 
ఆత్మకూరు రూరల్:   సిద్దేశ్వరం అలుగు పోరాటానికి సరిగ్గా నేటితో యేడాది పూర్తైంది. సిద్దేశ్వరం అలుగు సాధన సమితి ఆధ్వర్యంలో గత యేడాది మే 31న రాయల సీమ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది  రైతులు స్వచ్ఛందంగా కదలి వచ్చి సంగమేశ్వరం వద్ద సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి ప్రజా శంఖుస్థాపన చేశారు. ఈ ఉద్యమం జరగకుండా నివారించేందుకు పోలీసులు రైతు నాయకులను గృహనిర్భంధం చేశారు. కొన్ని చోట్ల రోడ్లను ప్రొక్లైనర్లతో తవ్వి గోతులు తీసి రైతుల వాహనాలను అడ్డుకున్నారు. అయినప్పటికి రైతులు  ఏమాత్రం వెనుకంజ వేయకుండా తమ సంకల్పం నెరవేర్చుకుని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వగలిగారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రాయలసీమ రైతు ఆవేదనను అర్థం చేసుకుని సీమకు చెందాల్సిన సాగునీటికి చట్టబద్ధ హక్కు కల్పించి సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని  రైతు లోకం కోరుకుంటోంది.
 
మరిన్ని వార్తలు