రేపటి నుంచి డివిజన్‌ల వారీగా ఉల్లి కొనుగోళ్లు

22 Oct, 2016 23:22 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి విక్రయించే రైతులకు గరిష్టంగా క్వింటాకు రూ.300 మద్దతు ఇస్తుండటంతో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి రెవెన్యూ డివిజన్‌ల వారీగా రైతులు మార్కెట్‌కు ఉల్లిని తీసుకొచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు రెవెన్యూ డివిజన్‌ రైతులు మాత్రమే మార్కెట్‌కు ఉల్లి తీసుకురాల్సి ఉంది. ఆదోని డివిజన్‌ రైతులు మంగళ, గురువారాల్లో.. నంద్యాల డివిజన్‌ రైతులు శనివారం మాత్రమే మార్కెట్‌కు దిగుబడులు తీసుకరావాలని మార్కెట్‌ కమిటీ అధికారులు తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు