మార్కెట్‌ యార్డుల ద్వారా ఉల్లి కొనుగోలు

30 Aug, 2016 22:38 IST|Sakshi
మార్కెట్‌ యార్డుల ద్వారా ఉల్లి కొనుగోలు
– కిలో రూ. 6 ప్రకారం ధర
– రూ. కోటితో గిడ్డంగుల నిర్మాణం
– ఆర్‌డీ వెంకట సుబ్బన్న 
 
కోవెలకుంట్ల : కర్నూలు, ఆదోని మార్కెట్‌యార్డుల్లో రైతుల వద్ద నుంచి కిలో రూ. 6 ప్రకారం ఉల్లి కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్‌యార్డు రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటసుబ్బన్న తెలిపారు. కోవెలకుంట్ల మార్కెట్‌యార్డును మంగళవారం ఆయన తనిఖీ చే శారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం మార్కెట్‌యార్డుల ద్వారా ఉల్లి కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నామన్నారు. కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు ఆవరణలో పాత గోదాముల స్థా«నంలో రూ. కోటితో వెయ్యి మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కల్గిన గిడ్డంగి ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. గత ఏడాది యార్డుకు రూ. 69 లక్షల ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ. 83 లక్షలకు చేరిందన్నారు. కార్యక్రమంలో జేడీ సుధాకర్, మార్కెట్‌యార్డు చైర్మన్‌ గడ్డం నాగేశ్వరరెడ్డి, సెక్రటరీ శివశంకర్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు