ఇక ఆన్‌లైన్‌

13 Jan, 2017 00:41 IST|Sakshi
ఇక ఆన్‌లైన్‌

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆన్‌లైన్‌ వైద్యసేవలు అందుబాటులోకిరానున్నాయి. ఇందులో భాగంగా ఈ–ఆస్పత్రి విధానాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రక్రియకు ప్రస్తుతం ఆస్పత్రిలో శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ–ఆస్పత్రి విధానం అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఈ–ఆస్పత్రి విధానం అందుబాటులోకి తీసుకురావడం ప్రథమం.  నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెల్‌  వారు ఈ–ఆస్పత్రి విధానం పరిశీలిస్తున్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోజు 1,147 మంది ఔట్‌ పేషెంట్‌లు, 544 మంది ఇన్‌పేషెంట్‌లకు వైద్యసేవలు అందుతున్నాయి. 470 పడకల గల ఈ ఆస్పత్రిలో సుమారు 100 మంది వరకు వైద్యులు అందుబాటులో ఉంటారు. ఒక రోగి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చే ముందు ఇంటివద్దే ఆన్‌లైన్‌లో అనారోగ్య సమస్య, వైద్యుడిని సంప్రదించి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. ఆస్పత్రికి ఏ సమయానికి వస్తున్నారు? డాక్టరును ఎప్పుడు కలుస్తున్నారో? డాక్టర్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటారో? అనేది ఆన్‌లైన్‌లో ముందుగా నమోదు చేసుకోవచ్చు. ఆస్పత్రికి వచ్చి నేరుగా వైద్యుడిని కలిసి వైద్యసేవలు పొందవచ్చు. మరోవైపు ఇన్‌పేషెంట్‌ విభాగానికి సంబంధించి రోగి ఆస్పత్రిలో అడ్మిట్‌ కాగానే అతనికి గుర్తింపు నంబర్, ఆధార్‌ నంబర్‌ నమోదు చేసుకుంటారు. సంబంధిత రోగి ఏ వార్డులో ఏ బెడ్‌పై , ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడో సంబంధిత రోగికి ఏ వైద్యుడు చికిత్స అందిస్తున్నాడో అతనికి ప్రతి రోజు అందించిన వైద్యసేవలు ఏమిటి అనేవి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరుగుతుంది.

ఏ ప్రాంతంలో ఉన్న రోగి గుర్తింపు నంబర్, ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తే సంబంధిత వైద్యచికిత్స వివరాలు తెలుసుకోవచ్చు. రోగికి సంబంధించి వైద్య పరీక్షలు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. రోగి వైద్య పరీక్ష చేయించుకోగానే సంబంధిత చికిత్స«(ఎక్స్‌రే, సిటీస్కాన్, రక్తపరీక్షలు తదితర) ధ్రువపత్రం నేరుగా వైద్యుడు వచ్చి చూడకుండా అతని ఉన్న దగ్గర నుండే ఆన్‌లైన్‌లో చూచి నిర్ధారించగలుగుతారు. ఒక వేల వైద్యుడు అందుబాటులో లేకున్న దూర ప్రాంతంలో ఉన్న సరే వైద్య పరీక్షలను ధ్రువీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా డాక్టర్‌ వద్దకు వెళ్లిన తరువాత వైద్య చికిత్సలు పొందిన రోగి మందులు ఏ సమయంలో వేసుకోవాలి? ఏలా వేసుకోవాలి? వివరాలు తన పేరు మీద నమోదు అవుతుంది. తన ఐడీ నంబర్‌ వైద్యచికిత్స వివరాలు తెలుసుకోవచ్చును. రోగికి సంబంధించి కేషీట్‌ కూడా ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరుగుతుంది. దీంతో రోగులకు ఆస్పత్రిలో ఎక్కడికి వెళ్లాలో ఇబ్బందులు ఉండవు. నేరుగా ఓపీ, ఐపీ విభాగంలోకి రాగానే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వారిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటారు. రెండో దశలో రోగులకు అందిస్తున్న మందులు, మాత్రలు, ఆపరేషన్‌కు సంబంధించి వివరాలు అత్యవసర చికిత్సకు సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన నెక్‌(నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెల్‌) విభాగం వారు కసరత్తు చేస్తున్నారు. ఈ–ఆస్పత్రికి సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు వివరాలు  చూడవచ్చు.

మరిన్ని వార్తలు