ఆర్డర్‌ఆఫ్‌ మెరిట్‌ అవార్డ్స్‌-2017కు ఆన్‌లైన్‌ ఓటింగ్‌

20 Aug, 2017 23:16 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో పాల్గొనాలని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు రోశన్న ఆదివారం ఓప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం (2017–18) నుంచి రాష్ట్రంలోని అన్ని కళాశాలలల్లో విద్యార్థుల ప్రవేశాలు, పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాల మంజూరుకు జన్మభూమి వెబ్‌పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జన్మభూమి వెబ్‌పోర్టల్‌లో ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డ్స్‌–17 కోసం ప్రిన్సిపాళ్లు, విద్యార్థులకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా మాత్రమే ఓటింగ్‌ చేసే అవకాశం కల్పించారు. 

మరిన్ని వార్తలు