ఓపెన్‌ స్కూల్‌ హాల్‌ టికెట్లు పంపిణీ

20 Sep, 2016 22:14 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌ స్కూల్‌) ద్వారా ఈనెల 28 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు, స్కూల్‌ నామినల్‌ రోల్స్‌ ఆయా స్టడీ సెంటర్లకు పంపిణీ చేసినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఆయా స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లను సంప్రదించి హాల్‌టికెట్లు పొందాలని సూచించారు.    

మరిన్ని వార్తలు