ఆర్కే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’

11 Dec, 2016 01:31 IST|Sakshi
ఆర్కే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’

మల్కన్‌గిరి ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌  

మల్కన్‌గిరి: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కోసం మళ్లీ పోలీసుల గాలింపు మొదలైంది. అక్టోబర్‌ నెలలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మృత్యువాత పడగా, రామకృష్ణ అలియాస్‌ ఆర్కే తప్పించుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో ఆర్కే గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్కే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’కు పోలీసులు శ్రీకారం చుట్టారు. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ జలాశయంలో శనివారం నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ బోట్లతో కూంబింగ్‌ చేపట్టారు. చిత్రకొండ జలాశ యంలో కటాఫ్‌ ఏరియాలో గల జోడాం, రల్లేగడ్డ, పనసపుట్‌ తదితర పంచాయతీలు, పరిసర గ్రామాల్లో బీఎస్‌ఎఫ్, ఎస్‌ఓజీ బలగాలు గాలిస్తున్నాయి.

ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. 2008లో చిత్రకొండ జలాశయంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న 36 మంది పోలీసులు మృత్యు వాత పడ్డారు. అప్పటినుంచి అక్కడ కూంబింగ్‌ అంటే ఒడిశా, ఆంధ్ర పోలీసులు వెనుకాడుతున్నా రు. దీంతో ప్రస్తుతం కూంబింగ్‌ చర్యల కోసం బుల్లెట్‌ప్రూఫ్‌ బోట్లను ఏర్పాటు చేశా రు. మూడు రాష్ట్రాల సరిహద్దులో మూడు వేల మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు చర్చించి ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’కు రూపకల్పన చేసినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు