ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిఘటిస్తాం

19 Apr, 2017 22:20 IST|Sakshi
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిఘటిస్తాం
కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు నల్లి రాజేష్‌ అన్నారు. కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి వ్యతిరేకంగా బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల మధ్య విభేదాలు సృష్టించడానికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్రమంత్రి వెంకయ్య ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు చెల్లదని ఒక పక్క కోర్టు స్పష్టం చేసినా అదే అంశాన్ని తెరమీదకు తీసుకురావడంలోని ఔనత్యం ఏంటని ప్రశ్నించారు. వర్గీకరణ జోలికొస్తే వెంకయ్యనాయుడుకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.  అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పదేళ్లు  ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసిన వెంకయ్య, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా రాదని రెండు నాల్కల« ధోరణితో మాట్లాడటం సరికాదన్నారు.  మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బీఎన్‌ రాజు, రామారావు, లోవరాజు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు