కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

20 Jul, 2016 23:57 IST|Sakshi
జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌) : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నర్సింహరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. స్వదేశి జపం చేస్తున్న ఎఫ్‌డీఐలను దేశంలో ప్రవేశ పెడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్‌ 2వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఇందులో 15 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, ఆ రోజు నిర్వహించే సమ్మెను విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సమ్మె కరపత్రాన్ని విడుదల చేశారు. కా ర్యక్రమంలో నాయకులు షాహిద్‌అలీ, చంద్రకాంత్, రాంమోహన్, అంబదాస్, రాముయాదవ్, బాలస్వామి, లక్ష్మణ్‌  పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు