అరకులో ప్రతిపక్ష నేతలు అరెస్ట్

9 Aug, 2016 10:32 IST|Sakshi

విశాఖపట్టణం : విశాఖపట్నం జిల్లా అరకులోయలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంతోపాటు పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు శెట్టి అప్పాలు, సమర్ది రఘునాథ్ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

అలాగే సీపీఎం, సీఐటీయూ, గిరిజన సంఘాల నేతలు పొద్దు బలదేవ్, ఉమా మహేశ్వరరావు తదితరులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో అరకులోయలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఆదివాసీ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొనున్నారు. ప్రత్యేక హోదాపై సదరు పార్టీలు నిరసనలు తెలిపే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. ముందుగానే వారిని అరెస్ట్ చేశారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా