లక్ష్మి అరెస్టుకు ఆదేశించాం: ప్రత్తిపాటి

29 Oct, 2016 17:30 IST|Sakshi
లక్ష్మి అరెస్టుకు ఆదేశించాం: ప్రత్తిపాటి

మెడికల్ స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్, డాక్టర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్యారాణి ఆత్మహత్య కేసులో చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య ఘటనతో సమ్మె కొనసాగిస్తున్న మెడికోలో ఆందోళన విరమించి విధుల్లో చేరాలని మంత్రి సూచించారు. లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజ్ ప్రమాదంపై ప్రత్యేక కమిటితో విచారణ చేపడతామని పుల్లారావు పేర్కొన్నారు. మూడు నెలల్లో బాధిత రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెడికో సంధ్యారాణి తన డైరీలో రాసి సూసైడ్ చేసుకుంది. కాగా, ప్రొఫెసర్‌ ఏవీవీ లక్ష్మిని అరెస్ట్‌ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్‌ డాక్టర్లు మరోసారి స్పష్టంచేశారు. నిన్న (శుక్రవారం) కూడా జూడాలు లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి చుట్టూ ర్యాలీ నిర్వహించారు. గతంలో ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మి వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. డాక్టర్ లక్ష్మి తన పలుకుబడిని తట్టుకోలేక సదరు ప్రొఫెసర్‌ బదిలీ చేయించుకొని వెళ్లారని, నేడు లక్ష్మి వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు