ఓరేటర్‌ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు ‘కైట్‌’

26 Jul, 2016 22:50 IST|Sakshi
తాళ్లరేవు : అంతర్జాతీయ టోస్ట్‌ మాస్టర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్‌ ఓరేటర్‌ 2016 చాంపియన్‌షిప్‌లో కైట్‌ విద్యార్థులు సెమీస్‌కు చేరినట్టు చైర్మన్‌ పి.వి. విశ్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని బాచుపల్లి బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన రెండో రౌండ్‌ పోటీల్లో 10 మంది సెమీస్‌కు చేరుకున్నారని, ఆగస్టు ఏడోతేదీన ఫైనల్‌ పోటీలు జరుగుతాయని ఏపీ ఏరియా మేనేజర్‌ రతన్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్‌ విశ్వం, డైరెక్టర్‌ జాన్‌ ఉదయ్‌కుమార్, కోఆర్డినేటర్లు ఎన్‌.వీరాంజనేయులు, ప్రసన్న అభినందించారు. 
2,78,704 క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం : గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం సాయంత్రం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద నీటి ఉధృతి స్వల్పంగా పెరిగింది. మంగళవారం సాయంత్రం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 2,78,704 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్‌ గేట్లను 0.60 మీటర్లు మేర పైకి లేపి ఉంచారు. బ్యారేజ్‌ వద్ద 9.60అడుగులు నీటి మట్టం నెలకొంది. భద్రాచలం వద్ద 25.50 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 2300 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1800 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు నాలుగు వేలు క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు.
 
మరిన్ని వార్తలు