సేంద్రియ ఆకు కూరల విక్రయ కేంద్రం ప్రారంభం

11 Jan, 2017 00:26 IST|Sakshi
సేంద్రియ ఆకు కూరల విక్రయ కేంద్రం ప్రారంభం
ఆత్మకూరురూరల్: రసాయన మందులు, ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలు, ఆకు కూరలు ఆత్మకూరు వాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో 38 ఎకరాల్లో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న కాయగూరలు, ఆకు కూరలను అమ్ముకునేందుకు రామ్‌కి సంస్థ ఆత్మకూరు ఆంధ్రాబ్యాంకు పక్కన ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించింది. సేంద్రియ పంట ఉత్పత్తి దారులను సమీకరించి ఏర్పాటు చేసిన సంగమేశ్వర వ్యవసాయ ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్‌ అన్న సంస్థ ద్వారా ఈ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నాబార్డ్‌ ఆర్థిక సాయంతో పకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న రామ్‌కీ సంస్థ ప్రతినిధులు రామిరెడ్డి, ఆంజనేయులు, నాబార్డ్‌ డీజీఎం నగేష్‌ కుమార్‌ చేతుల మీదుగా కేంద్రాన్ని ప్రారంభించారు. 
 
మరిన్ని వార్తలు