మన లక్ష్యం..ప్రజా పక్షం

26 Jul, 2016 01:24 IST|Sakshi
మన లక్ష్యం..ప్రజా పక్షం
కార్యకర్తలకు  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి దిశానిర్దేశం
 
అనంతపురం : ‘మన లక్ష్యం..ప్రజా పక్షం. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ప్రభుత్వం అవలంభిస్తోన్న వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా అనంత వెంకటరామిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ,  మాజీ ఎమ్మెల్యే, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త గురునాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ, మంచి నాయకుడి కోసం రా్రçష్ట ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇదే క్రమంలో ప్రజల్లోకి  వెళ్లేందుకు  వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ‘గడప గడపకూ వైఎస్సార్‌’ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ బూటకపు హామీలను ప్రజలకు వివరించే అకాశం వచ్చిందన్నారు. టీడీపీ, బీజేపీ రెండూ బలహీనపడుతున్నాయని ఈ తరుణంలో పుంజుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.  నేను, మేం అనేది కాకుండా మనం అనే అభిప్రాయంతో ముందుకు సాగాలన్నారు. జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు అపద్ధపు హామీలపై చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమానికి  అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం కారణంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే భావన ప్రజల్లో ఉందన్నారు. బేధాభిప్రాయాలు లేకుండా పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించాలని పార్టీ కేడర్‌కు సూచించారు. సమావేశంలో మాజీ మేయర్‌ రాగే పరుశురాం, పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి నదీం అహమ్మద్, కార్యదర్శి గౌస్‌బేగ్, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, గిరిజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలే జయరాంనాయక్, సేవాదల్‌ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా