హత్య చేసి ఆత్మహత్య అంటున్నారు

23 Aug, 2015 23:14 IST|Sakshi

- సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి
- మనీషా తల్లిదండ్రుల డిమాండ్

కడప అగ్రికల్చర్ : 'మా అమ్మాయి మనీషా ఆత్యహత్య చేసుకునేంత పిరికిది కాదు. నారాయణ కళాశాలలోనే చంపి ఉరివేసి యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరిస్తోంది. ఇప్పుడు విచారణ చేసిన కమిటీ వల్ల మాకు న్యాయం జరగదు. సిట్టింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది' అని కడప నారాయణ కళాశాలలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని మనీషా త ల్లిదండ్రులు సరోజ, బాలకృష్ణారెడ్డి, ఇతర బంధువులు డిమాండ్ చేశారు. ఆదివారం క డప నగరంలోని సీపీఎం కార్యాలయ ఆవరణలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. . సంఘటన జరిగిన రోజే మధ్యాహ్న సమయంలో ఏమమ్మా..భోజనం చేశావా? అని మనీషాను ఫోన్ ద్వారా అడుగగా ఇంకా తినలేదని తినడానికి పోతున్నానని, తలనొప్పిగా ఉందని చెప్పిందని, తలనొప్పి మందు రాసుకోమని చెప్పామని వారన్నారు.

అదేరోజు రాత్రి 7.30 గంటలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందని చెప్పారన్నారు. తాము వెంటనే అక్కడికి వెళ్లగా తమను కళాశాలలోకి రాన్వికుండా పోలీసులతో అడ్డగించారని చెప్పారు. ‘ఇక్కడ చనిపోయింది మా పాపే మేము చూడడానికి కూడా వీలులేదా’ అని అడిగితే అడుగడుగునా అడ్డగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు, కాళ్ల మీద కమిలిన గాయాలు ఉన్నాయని, ఉరి వేసుకుంటే దెబ్బలెలా తగిలాయో చెప్పాలని కోరారు. ఆ రోజు ఎలాంటి కాగితాలు దొరకనప్పుడు ఇప్పుడెలా ఆ కాగితాలు పుట్టుకొచ్చాయో అర్థం కావడంలేదన్నారు.

ఉరివేసుకుంటే కనీసం ఫ్యాను రెక్కలు వంగిపోయి ఉండాలని, నాలుక బయటకు వచ్చి ఉండాలని పోలీసులే చెప్పారు. మరి అలా అక్కడలేదన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, ప్రిన్సిపాల్‌ను, వార్డెన్‌ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని వారు పోలీసు అధికారులను ప్రశ్నించారు. మాకు ఒక్క అవకాశం ఇస్తే పోలీసుల ఎదుట ప్రిన్సిపాల్‌ను, వార్డెన్‌ను మూడు ప్రశ్నలు అడుగుతామని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు