హరితహారంలో మన జిల్లానే ముందు

11 Aug, 2016 23:59 IST|Sakshi
ఎర్రుపాలెం పోలీస్‌ స్టేషన్‌లో మొక్కలు నాటుతున్న జెడ్పీ సీఈఓ నగేష్, డీఎస్పీ రాంరెడ్డి

జెడ్పీ సీఈఓ నగేష్‌
ఎర్రుపాలెం: హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందున్నదని జెడ్పీ సీఈఓ ఎం.నగేష్‌ అన్నారు. ఎర్రుపాలెం పోలీస్‌ స్టేషన్‌లో వైరా డీఎస్పీ బి.రాంరెడ్డితో కలిసి గురువారం మొక్కలు నాటారు. పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఐదెకరాల భూమిలో 5000 మొక్కలు నాటించిన వైరా డీఎస్పీ రాంరెడ్డి, మధిర సీఐ నూనె వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఎన్‌.గౌతమ్‌ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. వైరా సబ్‌ డివిజన్‌ పోలీసులను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఆదర్శంగా తీసుకుని హరితహారం కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వైరా డీఎస్పీ రాంరెడ్డి నేతత్వంలో మిషన్‌ కాకతీయ పథకంలో పోలీసులు పాల్గొన్నారని, సబ్‌ డివిజన్‌ పరిధిలో 2.72 లక్షల మొక్కలు నాటారని ప్రశంసించారు. జిల్లాలో ఇప్పటివరకు అన్ని శాఖల సమన్వయంతో 3.60 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. వీటిని సంరక్షణ అందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌ఐ ఆంజనేయులు, ఏఎస్‌ఐ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు