11 ప్రాంతాల్లో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు

8 Oct, 2016 23:51 IST|Sakshi
పంజగుట్టలో ఎఫ్‌ఓబీ ఏర్పాటు కానున్న ఏరియా..

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో పాదచారులు రహదారులు దాటేందుకు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు..11 ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఎఫ్‌ఓబీ)ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. పబ్లిక్, ప్రైవేట్, భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో వీటిని చేపట్టనున్నారు. నగరంలో ముఖ్యమైన జంక్షన్లు, ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న 11 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీల ఏర్పాటుకు వీటిని ఆహ్వానించారు. ఏడాది క్రితం  జీహెచ్‌ఎంసీ నిధులతోనే ఎఫ్‌ఓబీలను ఏర్పాటుచేయాలనుకున్నారు. అనంతరం మారిన నిర్ణయంతో పీపీపీ పద్ధతిలో వీటిని ఏర్పాటుచేసే సంస్థలకే ప్రకటనల ఆదాయం పొందే వెసులుబాటు కల్పించనున్నారు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 25 కాగా, 17వ తేదీన ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు.

ఎఫ్‌ఓబీలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలు..
1. రామకృష్ణా మఠం,ఇందిరాపార్కు ఎదుట, దోమల్‌గూడ.
2. దివ్యశ్రీ, ఎన్‌ఎస్‌ఎల్‌ సెజ్‌ దగ్గర, గచ్చిబౌలి.
3. చిలకలగూడ సర్కిల్, ముషీరాబాద్‌ వైపు.
4. ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ ఎదుట, అమీర్‌పేట.
5. గ్రీన్‌లాండ్స్‌ అతిథిగృహం ఎదుట, బేగంపేట.
6. ఐడీపీఎల్‌ బస్టాప్, ప్రశాంత్‌నగర్‌.
7. జేఎన్‌ఏఎఫ్‌ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌– మహవీర్‌ హాస్పిటల్‌.
8. రాజీవ్‌గాంధీ రోటరీ– ఫోరమ్‌ సుజనా మాల్, కేపీహెచ్‌బీ  6వ ఫేజ్‌.
9. సైబర్‌ గేట్‌వే దగ్గర, హైటెక్‌సిటీ.
10. చెన్నయ్‌ షాపింగ్‌మాల్‌ దగ్గర, మదీనాగూడ.
11. హైదరాబాద్‌ సెంట్రల్‌మాల్‌ దగ్గర, పంజగుట్ట.



 

మరిన్ని వార్తలు