రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం

11 Mar, 2017 22:20 IST|Sakshi
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం
జగ్గంపేట : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు. ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలపై శనివారం జగ్గంపేటలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మరోతి శివగణేష్‌ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్‌ నిర్వహించారు. గ్రామంలో మెయిన్‌ రోడ్డులో పెద్దాపురం రోడ్డు శివారు నుంచి సెంటర్‌ వరకు పళ్లంరాజు, డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తదితరులు ప్రజా బ్యాలెట్‌ ఉద్యమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు కావాలా ? వద్దా ? అని, తెలుగుదేశం పార్టీ 2014ఎని్నకల మేనిఫెస్టోలో ఇచ్చిన 600లపై చిలుకు హామీలను నెరవేర్చిందా ? లేదా? అని రెండు ప్రధాన ప్రశ్నలకు తీర్పును ప్రజలను నుంచి కోరారు. అనంతరం స్థానిక సాయిబాలాజీ ఫంక్షన్‌ హాలులో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, పార్టీ «అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన జన ఆవేదన సమ్మేళనం సమావేశంలో మాజీ మంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ హోదా న్యాయసమ్మతం కావడంతో పవన్‌కల్యాణ్, జగన్‌మోహన్‌రెడ్డి హోదా కావాలని కోరుతున్నారన్నారు. గతంలో దురదుష్టకరమైన సంఘటన కారణంగా బలమైన నాయకుడు రాజశేఖరరెడ్డిని కోల్పోయామన్నారు. ఆయన హయాంలో రైతుల బాగుకు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని, ఉపాధి పథకం ద్వారా ఎందరికో పనులు లభించాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా నోట్ల రద్దు చేయడం దురహంకారమని, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మాయవతికి పదవి దక్కకుండా ఉండేందుకేనని నోట్ల రద్దుచేశారని ఆరోపించారు. హోదా కోసం కోటి సంతకాల ఉద్యమం విజయవంతం చేయాలన్నారు. డీసీసీ అ«ధ్యక్షుడు పంతం నానాజీ, నియోజకవర్గ ఇన్‌చార్జి మరోతి శివగణేష్, నాయకులు వత్సవాయి బాబు, అడబాల కుందరాజు, గుల్లా ఏడుకొండలు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, మార్టన్‌లూథర్, బాలేపల్లి మురళి, కాకి లక్ష్మణరావు, నక్కా సత్తిబాబు, ఏబీ సుధాకర్, ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు