పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలి

23 Nov, 2016 01:32 IST|Sakshi
పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలను పాటించి గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధిని సాధించాలని డీపీఓ ఇన్‌చార్జ్‌ సీఈఓ బి.రామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌ సంస్థలను బలోపేతం చేసే శిక్షణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రధాన ఉద్దేశాలను గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నెలరోజులపాటు జరిగే ఈ శిక్షణ శిబిరంలో రోజుకు రెండు మండలాల చొప్పున గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఉంటుందన్నారు. రీసోర్స్‌ పర్సన్లు కె.శ్రీనివాసులురెడ్డి, కె.ప్రత్యూషలు ఘనపదార్థాల నిర్వహణ వ్యవస్థ, సొంత ఆదాయాల పెంపు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, డిజిటల్‌ పంచాయతీ, గ్రామ పంచాయతీ సమావేశాలు, రికార్డుల నిర్వహణ అంశాలను వివరించారు. డీఎల్‌పీఓలు బాదూషాఖాన్, శ్రీనివాసరావు, ఎ.రమేష్, డీపీఓ కార్యాలయ ఏఓ సుధా, నెల్లూరు, వెంకటాచలం మండలాల్లోని గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 
 
 
>
మరిన్ని వార్తలు