పంచాయతీల అభివృద్ధిలో కీలకం కావాలి

27 Jul, 2016 22:37 IST|Sakshi
పంచాయతీల అభివృద్ధిలో కీలకం కావాలి
డీపీఆర్‌సీ సభ్యులకు అదనపు కమిషనర్‌ సుధాకర్‌ సూచన
సామర్లకోట : పంచాయతీల అభివృద్దిలో జిల్లా పంచాయతీ రీసోర్సు సెంటర్‌(డీపీఆర్‌సీ) సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు కమిషనర్‌ కె.సుధాకర్‌ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలడీపీఆర్‌సీ సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పంచాయతీల సిబ్బంది పనిలో లోపాల్ని గమనించి, సవరించాల్సిన బాధ్యత డీపీఆర్‌సీ సభ్యులపై ఉందన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ పంచాయతీ, పన్నుల సవరణ, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలోని సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తరువాత మండల స్థాయిలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు ఆయా పంచాయతీలల్లో 21 రోజుల పాటు పర్యటించే అవకాశం కల్పించామని, ఆ వ్యవధి చాలక పోతే మరో వారం పొడిగిస్తామని తెలిపారు. ఈ సెంటర్లలో సిబ్బంది సక్రమంగా పని చేసేలా చూడవలసిన బాధ్యత విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్‌లపై ఉందన్నారు. డీపీఆర్‌సీ సెంటర్లలో ండే డీఎల్‌పీఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు  సమన్వయంతో పని చేసి, ఆయా జిల్లాలకు మంచిపేరు తీసుకు రావాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ తోట కైలాస్‌గిరీశ్వర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు, ఫ్యాకల్టీలు కె.ప్రభాకర్, రామోహనరావు, ఇ.నాగలక్ష్మి, సిల్వియా, జె.రాంబాబు, గోపాలరావు, సత్యవాణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు