తప్పిన పెను ప్రమాదం

19 Dec, 2016 08:06 IST|Sakshi

హనుమాన్‌జంక్షన్: కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీ కృష్ణా ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆటో, కిరాణా దుకాణం మీదకు వెళ్లడంతో ఆటో ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు