నాడు కుమార్తె.. నేడు తండ్రి

14 Oct, 2016 22:52 IST|Sakshi

రాజంపేట రూరల్‌: వరుస మరణాలు సంభవించడంతో ఓ కుటుంబం విషాదంలో మునిగింది. మున్సిపాలిటీ పరిధిలోని బలిజపల్లె పూసల వీధికి చెందిన తన్నీరు అంజలి అనే బాలింత ఈ నెల 11న తిరుపతిలో చికిత్స పొందుతూ మతి చెందింది. అంజలి చనిపోయి మూడు రోజులు కూడా కాక ముందే.. ఆమె తండ్రి కటారి పెంచలయ్య శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు.
చేతబడి వల్లే మరణాలు
చేతబడి చేయడం వల్లే అంజలి, పెంచలయ్య మతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సమీప బంధువైన కటారి నరసింహులు చేతబడి చేస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. నరసింహులు తమ కుటుంబాన్ని నాశనం చేస్తానని పదేపదే చెబుతున్నాడని, చేతబడితో అందరిని చంపేస్తానని కూడా పేర్కొంటున్నాడని మతుల బంధువులు తెలిపారు. మతుడు పెంచలయ్య ఇంటి వద్ద రక్ష రేకులు ఉన్నాయని, ఆ రక్ష రేకులపై అంజలి, పెంచలయ్య అని రాసి ఉందని పేర్కొన్నారు. అందువల్ల నరసింహులును అనుమానించాల్సి వస్తుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా వరుస మరణాలు సంభవించడంతో బలిజపల్లె పూసలవీధి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా వుంటే వరుసగా కటారి కుటుంబంలో మరణాలు సంభవించడంతో పోలీసులు గ్రామానికి చేరుకొని ఆరా తీశారు. అయితే మతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

మరిన్ని వార్తలు