ఆదమరిస్తే.. చెత్తలోకి..

21 Aug, 2016 00:47 IST|Sakshi
ఆదమరిస్తే.. చెత్తలోకి..
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తలనొప్పిగా మారాడు. మతిస్థిమితం లేకపోవడంతో ఆ రోగి ఎప్పడు పడితే అప్పుడు బయటకు Ðð ళ్లిపోతున్నాడు. మాతా, శిశు వైద్యశాల వెనుక ఉన్న చెత్త కుప్పల్లోకి వెళుతూ, అక్కడ పడేసిన  బ్రెడ్‌ ముక్కలు, ఇతర ఆహార పదార్థాలు తింటున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రమాదంలో కాలికి గాయమైన గుర్తుతెలియని వ్యక్తిని 108 సిబ్బంది వాహనంలో తీసుకువచ్చి సెప్టిక్‌ వార్డులో చే ర్చారు. పాకుతూ పలుమార్లు బయటకు వెళ్లిపోవడం, తిరిగి రావడం పరిపాటిగా మారింది. రోగి బయటకు వెళ్లిపోతుంటే సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంఓ పద్మశ్రీని ‘సాక్షి’ వివరణ అడగ్గా.. మతి స్థిమితం లేకపోవడంతో అతను బయటికి వెళ్లిపోతున్నాడని, సిబ్బంది వెతికి తిరిగి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బంది కొరత వల్ల సెప్టిక్‌ వార్డులో స్టాఫ్‌ నర్స్‌ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారని, మందులు ఇతర అవసరాలకు కోసం వారు బయటకి వెళ్లినప్పుడు అతను బయటకు వెళ్లిపోతున్నాడని తెలిపారు.
 
 
మరిన్ని వార్తలు