పట్టాల మార్పుపై పీడీ విచారణ

18 Aug, 2016 19:23 IST|Sakshi
నూకపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో విచారణ చేస్తున్న పీడీ
  • నూకపల్లి హౌసింగ్‌బోర్డుకాలనీలో అక్రమాలు
  • అధికారుల విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు
జగిత్యాల రూరల్‌ : జగిత్యాల పట్టణ ంలోని నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన నూకపల్లి హౌసింగ్‌బోర్డుకాలనీలోని పట్టాల మార్పుపై విచారణ కొనసాగుతోంది. హౌసింగ్‌ పీడీ పి.నర్సింహరావు గురువారం కాలనీకి వచ్చి విచారణ చేపట్టారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో 4 వేల గృహాలకు పట్టాలివ్వగా ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 1,675 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు పీడీ తెలిపారు. వీరు మాత్రమే ఇళ్లు నిర్మించుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. గతంలోని పట్టాలు, ఇటీవల డీఈ పంపిణీ చేసిన పట్టాలు సైతం చెల్లవని ఆయన ప్రకటించారు. హౌసింగ్‌ ఈఈ శ్రీనివాస్, డీఈ రాజేశ్వర్, ఏఈ రాజమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రొసీడింగ్‌లు 
గతంలో హౌసింగ్‌ డీఈగా పనిచేసిన అధికారి ప్రస్తుతం డెప్యూటేషన్‌పై హైదరాబాద్‌లోని జలమండలి శాఖకు బదిలీపై వెళ్లారు. సదరు అధికారి అనధికారికంగా ఇందిరమ్మ గృహాల పట్టాలను పంపిణీ చేస్తూ సుమారు రూ.30 లక్షల మేర వసూలు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయనతోపాటు నూకపల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తమ్ముడి పాత్ర ఉందని అధికారుల వద్ద సమాచారం ఉంది. 

 

మరిన్ని వార్తలు