-

భక్తులకు సౌకర్యాలు కల్పించాలి

17 Aug, 2016 01:14 IST|Sakshi
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
మంత్రి జూపల్లి కృష్ణారావు
పెద్దకొత్తపల్లి: కృష్ణ పుష్కరాలకు వచ్చే భక్తులకు పుష్కరఘాట్ల వద్ద అధికారులు ఎలాంటి అసౌకర్యం కల్పించవద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం అమరగిరి పుష్కరఘాట్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆయన మాట్లాడారు. పుష్కర ఘాట్ల వద్ద బ్రాహ్మణులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు మంత్రికి తెలిపారు. పుష్కరఘాట్‌ ఇన్‌చార్జ్‌ అధికారులతో మంత్రి మాట్లాడారు. సోమశిల ఘాట్ల వద్ద ఉన్న కొంత మందిని అమరగిరి ఘాట్‌కు మార్చాలని సూచించారు.
పని కల్పించాలని గిరిజనుల వినతి
అమరగిరి పుష్కరఘాట్ల వద్ద తమకు పనులు కల్పించాలని గిరిజన మహిళలు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి మహిళలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరబోటులో సోమశిల ఘాట్‌కు మంత్రి కృష్ణానదిపై వెళ్లారు. నదిలో కృష్ణానది తీరం వెంట ఉన్న అందాలను మంత్రి సెల్‌ఫోన్లో ఫోటోలు తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల నుంచి అమరగిరి వరకు స్టీమర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి వెంట ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, నిరంజన్‌రావు, రాంమోహన్‌రావు, కొల్లాపూర్‌ జెడ్పీటీసీ హన్మంతునాయక్, అమరగిరి ఘాట్‌ అధికారి కృష్ణయ్య, నాగరాజు, తదితరులు ఉన్నారు.
మరిన్ని వార్తలు