పేరుకే పెద్దచెరువు

4 Sep, 2016 15:55 IST|Sakshi
అంబాజిపేట పెద్ద చెరువు
  • అయినా చుక్కనీరు కరువు
  • చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట పెద్ద చెరువు నీటి సామర్థ్యం 21 అడుగులు.900 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన చెరువు ఇది .పెద్ద చెరువు నిండితే చిన్నశంకరంపేట, అంబాజిపేట, అగ్రహారం, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్‌, జంగరాయి గ్రామాల్లోని 900 ఎకరాలు సాగవుతుంది.

    కానీ చెరువులోకి చుక్కనీరు చేరలేదు.పెద్ద చెరువు ఎప్పుడు పూర్తిస్థాయిలో ఎండిపోయింది లేదు. కానీ ఇసారి వేసవిలో చుక్కనీరులేకుండా ఎండిపోయింది. బోసిపోయిన చెరువులో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో కొద్దిపాటి నీరు మాత్రం చేరింది. దీంతో రైతులు చెరువుల కింద పంటల సాగుచేయడం లేదు.

    కొందరైతే బోరుబావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. మరి కొందరైతే ఇటుక బట్టిలు పెట్టేందుకు భూములు లీజుకు కూడా ఇచ్చారు. ఇంకొందరు వర్షంపై ఆధారపడి మొక్కజొన్న పంటలు వేశారు. చెరువు నిండక కరువు తలపిస్తోంది.

    రెండెకరాలు బీడుగానే ఉంది: ఎర్రి నర్సింలు, చిన్నశంకరంపేట
    పెద్ద చెరువు కింద రెండెకరాల పోలం ఉంది. కానీ చెరువులో నీరులేకపోవడంతో పొలం బీడుగానే ఉంది. చెరువులోకి చుక్కనీరు కూడా చేరకపోవడంతో చెరువు కింద ఎవరు కూడా పంటలు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో కరువు పరిస్థితని ఎదుర్కొంటున్నాం.

    పొలం ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చిన: నర్సింహారెడ్డి, చిన్నశంకరంపేట
    వర్షాకాలంలో చెరువు నిండుతుందని ఆశపడ్డాం.కానీ చెరువులోకి చుక్క నీరురాలేదు. పేరుకే పెద్ద చెరువుగా మారింది, వర్షాలు కురవకపోవడంతో చుక్కనీరు చేరడంలేదు. దీంతో బీడుగాఉన్న పొలాన్ని చేసేదేమీలేక ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చా.. ప్రభుత్వం కరువు సాయం అందజేసి ఆదుకోవాలి.

మరిన్ని వార్తలు