10 లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

5 Nov, 2016 22:01 IST|Sakshi
  • జేసీ సత్యనారాయణ ఆదేశం
  • కాకినాడ సిటీ : 
    జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 10లోగా ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై తహసీల్దార్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్షించారు. గత సీజ¯ŒSలో వచ్చిన అభియోగాలు, అసంతృప్తులు పునరావృతం కాకూడదన్నారు.
             చౌకధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీలో అవకతవకలు నిరోధించేందుకు ప్రతీరోజు రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో నివేదికలు అందజేయాలని సూచించారు. ప్రజాసాధికార సర్వే ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ  ఉమామహేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ డీఎం కృష్ణారావు, డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు, డీసీఓ ప్రవీణ, మార్కెటింగ్‌ శాఖ ఏడీ  కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు