పల్లె వాతావరణంలో ‘పెళ్ళిగోల’

3 Apr, 2017 23:33 IST|Sakshi
  • ∙తెలుగుదనానికి అద్దం పట్టే వెబ్‌ సిరీస్‌
  • ∙నంగవరంలో చురుకుగా షూటింగ్‌
  • ఉప్పలగుప్తం (అమలాపురం) : 
    కోనసీమ అందాలు తొణికిసలాడే గ్రామీణ వాతావరణంలో అన్నపూర్ణ స్టూడియో, తమాడా మీడియా ద్వారా చిత్రీకరిస్తున్న ‘పెళి్ళ గోల’ వెబ్‌ సిరీస్‌ రెం డో షెడ్యూల్‌ షూటింగ్‌ ఉప్పలగుప్తం మండలం నంగవరంలో జరుగుతోంది. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం అభిజిత్, ‘చందమామ కథలు’ ఫేమ్‌ వర్షిణి నాయకానాయికలుగా నటిస్తున్న సిరీస్‌లో పలువురు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు నటిస్తున్నారు. తెలుగు సాంప్రదాయాలు, కళలకు అద్దం పట్టేలా ‘పెళి్ళగోల’ రూపుదిద్దుకుంటోందని ప్రొడక్ష¯ŒS మేనేజర్‌లు ఆకుల రాము, యేడిద దుర్గాజీ తెలిపారు. థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసే తీరిక లేని ఈ యుగంలో ఇంటర్‌నేషనల్‌ మొబైల్‌ య్యూ యాప్‌ ద్వారా చిత్రం రిలీజై, మొదటి ఎపిసోడ్‌ ఇప్పటికే ప్రశంసలందుకుందని చెప్పారు. మొత్తం పది ఎపిసోడ్‌లలో మూడు ఎపిసోడ్‌ల షూటింగ్‌ పూర్తయిందన్నారు. చిత్ర నిర్మాతలు రాహుల్‌ తమాడా, సాయిదీప్‌రెడ్డి బొర్రా, లై¯ŒS ప్రొడ్యూసర్‌ బసవా శ్రీహర్ష  కాగా ‘నరుడా డోనరుడా’ ఫేం మల్లిక్‌రామ్‌  దర్శకత్వం వహిస్తున్నారని, వినయ్‌ ఫోటోగ్రాఫర్‌ అని చెప్పారు. కథకు తగ్గట్టు ఇక్కడి పూ ర్వపు గ్రామీణ వాతావరణం, మండువా లోగిళ్ళు చిత్రీకరణకు దోహదపడుతున్నాయని డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ అన్నారు. కోనసీమకు చెందిన సినీ హీరో గనిశెట్టి రమణలాల్‌ సూచించిన లోకేష¯ŒS యూనిట్‌కు నచ్చడంతో ఆయన సహకారంతో షూటింగ్‌ నిర్విరామంగా జరుగుతోందని, నంగవరం స ర్పం చి, వైఎస్సార్‌ సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు చిత్రీకరణకు అన్నివిధాలా సహకరిస్తున్నారని మేనేజర్‌ రాము తెలిపారు.
     
>
మరిన్ని వార్తలు