105 పింఛన్లు అనర్హమైనవే

18 Mar, 2017 23:33 IST|Sakshi
105 పింఛన్లు అనర్హమైనవే
  • అధికారుల తనిఖీల్లో బయటపడిన బండారం
  • 105 పింఛన్లు రద్దు ... పంపిణీ నిలిపివేత
  • పాత పింఛన్లపైనా దృష్టి ... దరఖాస్తుల పరిశీలన
  • అడుగడుగునా అడ్డుపడుతున్న కౌన్సిలర్లు
  • పిఠాపురం :
    ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. పిఠాపురం ము న్సిపాలిటీలో భార్యలు బతికుండగానే వితంతువులుగా మార్చేసి ప్రతి నెలా రూ.1000 స్వాహా చేస్తున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్‌ గత నెలలోనే దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పటికే మున్సిపల్‌ అధికా రులు ఒకసారి రెవెన్యూ అధికారులు ఒకసారి విచారణ నిర్వహించగా ముచ్చట గా మూడోసారి మళ్లీ మున్సిపల్‌ అధికా రులు విచారణ చేపట్టి 105 మంది పింఛ ¯ŒSదారులు అనర్హులని నిర్ధారించారు. దీం తో వాటిని రద్దు చేయాలంటూ స్థానిక మున్సిపల్‌ అధికారులు ఉన్నతాధికారుల కు నివేదికలు పంపడంతోపాటు వాటిని ఆ¯ŒSలై¯ŒSలోంచి తొలగించి పంపిణీని నిలిపివేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న అధికారులు పాత పింఛన్లపైనా దృష్టి కేంద్రీకరించారు. అన్ని దరఖాస్తులనూ పరిశీలిస్తున్న అధికారులు ఇంకా  అనర్హులున్నారా అనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.  ఎప్పుడో ఇచ్చిన పింఛన్లపై ఇప్పుడు పరిశీలనలు ఏమిటని కొంతమంది కౌన్సిలర్లు అడ్డుతగులుతున్నారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా అనర్హులను గుర్తించడానికే పాతవి పరిశీలిస్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ సమాధానమిచ్చారు. 
    తొక్కిపెట్టేసిన నివేదికపై పెన్నుపోటు...
    ‘సాక్షి’ ఇచ్చిన కథనాలపై కొనసాగిన దర్యాప్తు నివేదికలను జిల్లా కలెక్టరుకు గత నెలలోనే అందజేశారు. కానీ వాటిపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇంతలో మార్చి నెల పింఛన్లు వచ్చేయగా తిరిగి మళ్లీ అక్రమార్కులకే పంపిణీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ‘పింఛన్లపై విచారణ అంతా వంచన’ అనే శీర్షికన మార్చి ఒకటో తేదీన కథనం వెలువడడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లు 321 పంపిణీని నిలిపి వేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ సిబ్బందితో పునర్విచారణ జరిపించాలని కలెక్టర్‌ ఆదేశించడంతో మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రామ్మోహ¯ŒS మున్సిపల్‌ డీఈ మాధవి, టీపీఎస్‌ శేషగిరి, ఆర్వో రూబే¯ŒS, ఏఈఈ వంశీ అభిషక్‌లను విచారణాధికారులుగా నియమించగా  30 వార్డుల్లో విచారణ చేపట్టారు.
    అర్హులకు అవకాశం...
    ఈ విచారణ పూర్తయ్యాక 321 పింఛన్లలో 105 తొలగించారు. వాటి స్థానంలోఅర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డుల్లోను సుమారు 200 మంది అర్హులైన అబ్ధిదారులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకోగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హులకు కొత్త పింఛన్లు అందనున్నాయి. అయితే రద్దు చేసిన పింఛన్లు కొత్త వారికి ఇస్తారా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. 
     
    పింఛ¯ŒS అక్రమాలపై విచారణ
    కొంకుదురు(బిక్కవోలు): కొంకుదురు గ్రామంలో సామాజిక పింఛన్ల అక్రమాలపై ఈ నెల7వ తేదీన ‘బొట్టు చెదరకున్నా’ భరోసా శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం ఎంపీడీవో పోకల విజయభాస్కర్‌ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 40మందిపై విచారణ నిర్వహించాల్సి ఉండగా 37 మంది లబ్థిదారులు హాజరయ్యారు  వారి వివరాలు నమోదు చేసిన విజయభాస్కర్‌ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఉప సర్పంచి కొవ్వూరి వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     
    రద్దు చేసింది నిజమే...
    ఇటీవల కొత్తగా పంపిణీ చేసిన పింఛన్లలో 105 అనర్హమైనవిగా గుర్తించి రద్దు చేశాం. ఇప్పటికే వారి పేర్లను ఆ¯ŒSలై¯ŒSలోంచి తొలగించడంతోపాటు మార్చి నెల సొమ్ము పంపిణీని నిలిపివేశాం. అనర్హుల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
    – ఎం.రామ్మోహ¯ŒS, మున్సిపల్‌ కమిషనర్, పిఠాపురం
     
>
మరిన్ని వార్తలు