ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి

30 Nov, 2016 01:22 IST|Sakshi
నల్లగొండ :  భారత ప్రభుత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినందున ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌‌సలో నోట్ల రద్దు వల్ల ఆయా జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజలు నోట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు తగ్గించి ఆన్‌లైన్, స్మార్ట్‌ఫోన్, స్వైప్ మిషన్‌‌స ద్వారా జరిపే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. 
 
 డిజిటల్ అక్షరాస్యతను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ,  సహకార సంఘాలు, మార్కెట్‌యార్డులు, ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలు, మెడికల్‌షాపులు, పెట్రోల్‌బంకులు, గ్యాస్ డీలర్లు వంటి ప్రజా వినియోగ ఆర్థిక లావాదేవీలను నగదు రూపంలో కాకుండా డెబిట్‌కార్డుల ద్వారా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 204 ఏటీఎంల ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సుమారు వంద కోట్లు అవసరముంటుందన్నారు. 
 
 ప్రస్తుతం 128 ఏటీఎంలలో రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీలను జరిపేందుకు పెద్ద వ్యాపార సంఘాలు, పెట్రోల్ బంకు యజమానుల నుంచి స్వైప్‌మిషన్‌ల కోసం 179 దరఖాస్తులు వచ్చాయన్నారు. అదే విధంగా నూతన ఖాతాలు తెరిచేందుకు 861 అప్లికేషన్‌లను వివిధ బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.రామకృష్ణారావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ సూర్యం, డీఆర్వో అంజయ్య, అటవీశాఖాధికారి శాంతారామ్, బ్యాం కు అధికారులు పాల్గొన్నారు.   
మరిన్ని వార్తలు