విషజ్వరాలతో విలవిల

26 Aug, 2016 01:55 IST|Sakshi
విషజ్వరాలతో విలవిల

 మంచంపట్టిన కొండకిందిగూడెం
– 100కు చేరిన జ్వరపీడితుల సంఖ్య
– నలుగురి పరిస్థితి విషమం
– హైదరాబాద్, సూర్యాపేట ఆస్పత్రులకు తరలింపు
– పారిశుద్ధ్య లోపంతోనే రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తుల ఆవేదన
– పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు
కేతేపల్లి:
కేతేపల్లి మండలం కొండకిందిగూడెలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 100 మంది గ్రామస్తులు మంచం పట్టారు. గ్రామంలో సుమారు 350 కుటుంబాల్లో 1500 వరకు జనాభా ఉన్నారు. వారం రోజులుగా ఒకొక్కరిగా జ్వరాల బారిన పడుతూ, జ్వరాలు కాస్త ముదిరి ఒకరొ నుంచి మరొకరికి సోకి గ్రామం మొత్తం విస్తరించిపోయింది.  ప్రతి ఇంట్లో ఒకరి నుంచి ఇద్దరు జ్వరపీడితులున్నారు. మాజీ సర్పంచ్‌ కోట్ల రాములు, రాచకొండ సుగుణమ్మ, కేశబోయిన సతీష్, నర్సింగ్‌ సతీష్, బండారు శ్రీరాములు, కోట్ల లింటమ్మ, కోట్ల నాగయ్య, తెట్టి నాగులు, అల్లి వీరస్వామి, దొతం నాగయ్య, వంగూరి మార్తమ్మ, అల్లి అంజి మరో ఇరవై ఐదు కుటుంబాల వ్యక్తులు విషజ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోప్రైవేట్‌ వైద్యులను ఆశ్రయిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట, హైదరాబాద్‌లలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు.
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
గ్రామంలోడ్రెయినేజీ సక్రమంగా లేకపోవటంతో పాకరిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాల్వల్లో పేరుకపోయిన మురుగును తొలగించక పోవటం వల్ల ఈగలు, దోమల వ్యాప్తి పెరగటంతో పాటు దుర్వాసన వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి నుంచి తాగునీటి ట్యాంకును శుభ్రం చేయక పోవటంతో తాగునీరు కలుషితపై వాధ్యుల భారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జ్వరపీడితులకు వైద్యపరీక్షలు
విష జ్వరాలతో బాధపడుతున్న కొండకిందిగూడెం ప్రజలకు గురువారం కేతేపల్లి ప్రాథమిక కేంద్రం ఆద్వర్యంలో వైద్య పరీక్షలు నిరహించారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి 288 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తీవ్ర అస్వస్థకు లోనయిన వారికి అక్కడే సెలైన్‌ ఎక్కించి, ఇంజక్షన్‌లు చేశారు. జ్వరంతో బాధపడుతున్న 68 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. నిల్వ చేసిన నీటిని తాగటం వల్లనే సీజనల్‌గా విషజ్వరాలు వస్తున్నాయని మండల వైద్యాధికారి లక్ష్మికాంత్‌ తెలిపారు. కాచి వడబోసిన నీటిని తాగటంతో పాటు, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని  సూచించారు. రక్త నమూనాల రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యశిబిరంలో సర్పంచ్‌ డి.సాయిరెడ్డి, నకిరేకల్‌ ఎసీపీహెచ్‌వో చరణ్‌దాస్, సీహెచ్‌ఓ సందర్‌నాయక్, వైద్యసిబ్బంది జగదీష్‌రెడ్డి, దయామణి, రుక్మారెడ్డి, రాజమ్మ, అనిత, అంగన్‌వాడీ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.


 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు