రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

27 Feb, 2017 23:23 IST|Sakshi

ఆరిలోవ(విశాఖ తూర్పు): జాతీయ రహదారిపై వెంకోజీపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరిలోవకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రెండో వార్డు గాంధీనగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ నగర కార్యదర్శి రాగతి అచు్యతరావు రెండో అన్నయ్య రాగతి నడిపి అచు్యతరావు(43) శనివారం సాయంత్రం నగరంలోకి సొంత పని మీద ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి రాత్రి 10.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా వెంకోజీపాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద మలుపు తిరుగుతుండగా వెనక నుంచి వస్తున్న విశాఖ డెయిరీ పాల ట్యాంకర్‌ ఢీకొట్టింది. అచు్యతరావు హెల్మెట్‌ ధరించినా తలపైకి ట్యాంకర్‌ చక్రం ఎక్కేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ æసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయా్యరు. మూడో పట్టణ పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణవైున పాల ట్యాంకరును డ్రైవర్‌ పోలీసులకు చిక్కకుండా వేగంగా తరలించేశాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ట్యాంకర్‌ను విజయనగరం జిల్లా భోగాపురం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మృతుడు అచు్యతరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈయన శుభకార్యాలకు సప్లయర్స్, ఫ్లవర్‌ డెకరేషన్  కాంట్రాక్ట్‌ చేస్తుండేవాడు. వైఎస్సార్‌సీపీ తూర్పు కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు గొలగాని శ్రీనివాస్‌.. రాగతి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నగరంలో పని చూసుకొని సినిమాకు వెళ్లారని, సినిమా మధ్యలోనే వస్తూ ఈ ప్రమాదానికి గురయా్యరని మృతుడి కుటుంబ సభ్యులు రోదించారు. సినిమా పూర్తయినంత వరకు ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు
చేస్తున్నారు.

మరిన్ని వార్తలు