పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

20 Sep, 2016 02:05 IST|Sakshi
ఏలూరు అర్బన్‌  : ప్రమాదంలో గాయపడి  వికలాంగుడైన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే భావనతో పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..  లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెందిన పామర్తి లక్షీ్మనారాయణ ( 37)  కల్లుగీత కార్మికుడుగా గతంలో పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వికలాంగుడుగా మారి ఏ పనీ చేయలేక ఇంటికే పరిమితమయ్యాడు.  కుటుంబ సభ్యులకు భారంగా మారుతున్నాననే బాధతో మనోవ్యథకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు బాధితుని ఏలూరు ్రçపభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం మరణించాడు. ధర్మాజీగూడెం ఎస్‌ఐ క్రాంతికుమార్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు