అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

10 May, 2017 23:06 IST|Sakshi
పాములపాడు: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక బాలగారి విజేయుడు(46) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన పాములపాడులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్దూరు గ్రామానికి చెందిన విజేయుడు 15 సంవత్సరాల క్రితం పాములపాడుకు వచ్చి స్థిరపడ్డాడు. ఎస్సీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటి కోసం రూ.1.50లక్షలు అప్పు చేశాడు. అప్పుల బాధతో తాగుడుకు బానిసయ్యాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై ఈనెల 9న అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో మృతుని భార్య ఆశీర్వాదమ్మ పొదుపు డబ్బులు చెల్లించేందుకు వెళ్లింది. సమావేశం ముగించుకొని ఆమె ఇంటికి వచ్చే సరికి భర్త మృతదేహం ఫ్యాన్‌కు వ్రేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె కేకలు వేయగా చుట్టు ప్రక్కల వారు వచ్చి వ్యక్తిని కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్దామని ప్రయత్నించారు. అయితే అప్పటికే మృతిచెంది ఉండటాన్ని గమనించి ఏమి చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధాకరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్య ఆశీర్వాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు