విద్యార్థిని చితకబాదిన పీఈటీ

20 Jun, 2017 22:50 IST|Sakshi

రాయదుర్గం అర్బన్‌ : రాయదుర్గంలోని మోడల్‌ స్కూలులో ఏడో తరగతి చదివే తమ కుమారుడు మహమ్మద్‌ ఆదిల్‌ అనే విద్యార్థిని పీఈటీ దివాకర్‌ చితకబాదినట్లు తండ్రి హెచ్‌.కె.బాషా ఆరోపించారు. మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత ప్రార్థన చేసేందుకు వెళ్తుండగా, ఐడీ కార్డు ఎందుకు వేసుకొని రాలేదంటూ చేతులు, కాళ్లపై విపరీతంగా కొట్టినట్లు ఆయన వివరించారు. తమ బిడ్డతో పాటు మరో ఇద్దరు విద్యార్థులనూ అతను కొట్టినట్లు చెప్పారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాసం(రోజా) ఉన్న తమ కుమారుడ్ని కొట్టడంతో బాషా ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని మోడల్‌ స్కూలు ప్రిన్సిపల్‌ ప్రకాశ్‌నాయుడుకు ఫోన్‌లో వివరిస్తే సరైన సమాధానం చప్పకపోగా.. ‘కొట్టేదే.. ఏం చేసుకుంటావో చేసుకోపో...’ అంటూ దురుసుగా మాట్లాడినట్లు ఆయన వాపోయారు. గతంలోనూ ఇంటర్‌ చదువుతున్న తన కుమార్తెను కొట్టాడని తెలిపారు. ఇప్పుడు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాషా తెలిపారు. ఈ ఆరోపణలపై ప్రిన్సిపల్‌ స్పందిస్తూ.. ఘటనపై విచారిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు