ఏపీ రాజధానిపై 'సుప్రీం'లో పిటిషన్

31 Aug, 2015 13:07 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజ్యాంగానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారిక దేవ సహాయం ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తూ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఈ అంశంపై వాదనలన్నీ కూడా హైకోర్టు వినిపించాలని పిటిషన్దారుకు సూచించింది. ఈ విషయంలో తాను జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.

మరిన్ని వార్తలు